శామిర్ పేట అక్టోబర్ 21
24/7 తెలుగు న్యూస్
ప్రజా సమస్యల పరిష్కారం తోనే అభివృధి సాధ్యం అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.శామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్ పేట్ , అలియాబాద్ గ్రామాల్లో పర్యటించారు.పర్యటనలో భాగంగా లాల్ గడి మలక్ పేట్ ఇందిరమ్మ కాలనీ వద్ద రోడ్డు సమస్యలు తెలుసుకున్న మంత్రి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.అలాగే అలియాబాద్ లో గల హెచ్ బి ఎల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మంత్రినీ ఆహ్వానించి కార్మికుల సమస్యలు ఆయనకు తెలిజేసారు.
