ప్రాంతీయం

*భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి*

116 Views

అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు*

*వాగులు,చెరువులు, ప్రాజెక్టుల వద్దకి ఎవరు వెల్లద్దు*

*పోలీస్ అధికారయంత్రాంగంన్నీ అప్రమత్తం చేసాం*

*సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం*

*జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే *

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పెట్టుకోబద్దు అని..బారి వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యాత్రగాన్ని అప్రమత్తం చేసాం అని అన్నారు.జిల్లా పోలీస్ అధికారులు,సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు..సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే నిమిషాల్లో తక్షణ సహాయక చర్యలు చేపడుతం
నర్మాల ఎగువ మానేరు జలాశయం నుండి వరద ప్రవాహం ఎక్కువగా వస్తుందని,మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలని జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద జన సమూహాలు లేకుండా పోలీస్ అధికారులు అప్రమత్తతా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు..
అదేవిధంగా మత్స్యకారులు  చేపల వేటకు వెళ్లకూడదని అన్నారు.జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా , రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు  ఏర్పాటు  చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఎస్పీ  గారు పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. భారీ వర్షం మరియు బలమైన గాలుల సమయంలో విద్యుత్ తీగలు,స్తంబాలు మరియు ట్రాన్స్ఫార్మర్లకు  దూరంగా ఉండండి.అలాగే తడి చేతులతో స్విచ్ బోర్డులు ముట్టకోవద్దు అని సూచించారు.ప్రజలందరూ ఈ వర్షా కాలంలో  తగు జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా  ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు..

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7