ముస్తాబాద్ డిసెంబర్ 02, శుక్రవారం అయ్యప్ప పడిపూజను శ్రీశ్రీ రాజుగురు స్వామి శాంతిస్వరూపులు ఆశీస్సులు మీదుగా హరిహర పుత్ర అయ్యప్ప స్వామి విగ్రహమూర్తికి 18 మెట్లను ఏర్పాటు చేసి పువ్వులతో అలంకారాలతో ప్రత్యేక భక్తిగీతాలను ఆలపిస్తూ పూజలు నిర్వహించ నున్నారు. మండలంలోని అయ్యప్ప స్వాములు, గ్రామస్థుల సమక్షంలో ఘనంగా అయ్యప్ప పడిపూజలు నిర్వహించి ఇందులో గురుస్వాములచే వినాయక స్వామి, సుబ్రమణ్యస్వామి, అయ్యప్పస్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకం అనంతరం 18మెట్లపై ప్రత్యేక పూలతో అలంకరించి అయ్యప్ప స్వామి శరణుగోషతో గృహమున మార్మోగే విధంగా ఈఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆయా గ్రామాల భక్తులు స్వాములు పాల్గొనాలని ముస్తాబాద్ మండల ఎంపీపి జనగామ శరత్ రావు ప్రత్యేక పూజల కార్యక్రమానికి వారి స్వగృహమునకు భక్తులను ఆహ్వానించేందుకు కోరారు.
