Breaking News

నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

263 Views

-విశ్వకర్మలకు వరం-“విశ్వకర్మ యోజన పథకం”

-బీసీల అభ్యున్నతే మోడీ ప్రభుత్వ లక్ష్యం

(మానకొండూర్ సెప్టెంబర్ 16)

మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లె మీద చౌరస్తాలో శనివారం బిజెపి ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, కార్యదర్శి ఏర్రోజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో 18 బిసి కులాలకు 13వేల కోట్లతో “విశ్వకర్మ యోజన” అనే పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఓబీసీ మోర్చా జిల్లా ప్రబారి, బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి నియోజవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు మాట్లాడుతూ…

భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి విశ్వకర్మలను పట్టించుకోలేదని, నరేంద్ర మోడీ ప్రభుత్వం విశ్వకర్మల అభ్యున్నతి కోసం 13 కోట్లతో విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 30 లక్షల విశ్వకర్మలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ,కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని శ్రీనివాస్ గౌడ్,మానకొండూర్, గన్నేరువరం మండలాల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నగునూరి శంకర్ నాయకులు సోన్నాకుల శ్రీనివాస్, వంగల ఆంజనేయులు, కనుకుంట్ల ఆంజనేయులు, చొప్పరి అశోక్, మార్కొండ రమేష్ పటేల్, భాషా బోయిన ప్రదీప్ యాదవ్, ఆరెల్లి శ్రీహరి, దురిశెట్టి రమేష్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, నందగిరి బలరాం, పూసాల సాయికుమార్, బండి అఖిల్ గౌడ్,బోయిని అభిషేక్ ,కొంకటి అనిల్,వనపర్తి బ్రహ్మయ్య, ఆనంతోజు సత్యనారాయణ, గుగ్గిల లక్ష్మీనారాయణ, నందగిరి రాజు, బ్రహ్మోజు సత్యం పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *