Breaking News

బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ

70 Views

మంచిర్యాల జిల్లా.

బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ… బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న.

మంచిర్యాలలో ఈరోజు జరిగిన బీసీ రాజ్యాధికార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేసినారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇవి రెడ్డి, వెలమ పార్టీలని బీసీలకు ఇవి ఎన్నడు న్యాయం చేయాలని అందుకోసమో త్వరలో బీసీల నాయకత్వం లో బీసీల పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని మంచిర్యాలలో వందల మంది బీసీల సమక్షంలో ప్రకటన చేసినారు. బీసీల హక్కుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, ఇప్పటికైనా మెజార్టీ, బీసీ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కలుపుకొని పోయి రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారిని స్థాపిస్తామని శపథం చేసినారు. అదేవిధంగా మంచిర్యాలలో గుప్పెడు మంది లేని రెడ్డి, వెలమలు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని.. ఇక మీదట వాళ్ళ రాజకీయాలను కొనసాగించబోమని రానున్న రోజుల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ బిడ్డను గెలిపించుకుంటామని, అన్నారు. ఈ సభకు ఆటంకాన్ని కొనసాగించన కూడా వందలాది మంది బీసీలు రావడం సంతోషిదాయకమని రానున్న రోజులన్నీ బీసీల రోజులని అందుకోసం బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి గ్రామ గ్రామాన బీసీల జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బీసీ బిడ్డ రానున్న ఎన్నికలలో బీసీలకే ఓట్లు వేద్దామని పిలుపునిచ్చాడు. ఈ రాష్ట్రంలో 42 శాతం స్థానిక ఎన్నికలలో సీట్లు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలు చెప్పడం విడ్డూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కుల జనగణలలో అగ్రకులాలు 15% ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారం స్థానిక సంస్థ ఎన్నికలలో 15% మీ టికెట్లు మీరు తీసుకొని పక్కకు జరగాలని డిమాండ్ చేశాడు. అదే విధంగా అగ్రవర్ణాల్లో పేదల పేరిట 10 శాతం ఉద్యోగ ఉపాధి రంగాలలో అగ్ర కులాలు దోపిడీ చేస్తున్న బీసీ రాజ్యాధికారంలో తొలగిస్తామని. అగ్రకులాలో ఉన్న నాలుగు శాతం పేదలకి EWS కేటాయిస్తామని. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లలో మా బీసీల వాటాను కూడా తేల్చాలని లేకుంటే ఈ పార్టీలకు మహిళలతో నీ బుద్ధి చెప్పిస్తామని , రానున్న బీసీ రాజ్యంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరికీ న్యాయం చేస్తావని అన్నారు ఈ సభలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుధ గాని హరిశంకర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ వట్టే జానయ యాదవ్, శంకర్ గౌడ్, నరసయ్య యాదవ్ బీసీ పొలిటికల్ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి మహేష్ వర్మ,, మంచిర్యాల జిల్లా బీసీ జెసి అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, జేఏసీ నాయకులు, బీసీ నాయకులు మంచిర్యాల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, యాదబోయిన రాజన్న యాదవ్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ , సింగరేణి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బద్రి బుచ్చన్న, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిలకని సుదర్శన్, బీసీ సీనియర్ నాయకులు రాజేశం గౌడ్, కర్నే శ్రీధర్ వెంకటేష్ మధు, బీసీ యువజన నాయకులు ఎండి లతీఫ్, కలువల శ్రీను, బాబు యాదవ్, తీన్మార్ మల్లన్న టీం నాయకులు దీపక్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *