– కరీంనగర్ బిఎస్పీ పార్టీ ఈసీ మెంబర్ పెద్దోళ్ల శ్రీనివాస్
(మానకొండూర్/బెజ్జంకి సెప్టెంబర్ 14)
బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుందని కరీంనగర్ జిల్లా బీఎస్పీ పార్టీ ఈసీ మెంబర్ పెద్దోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రము లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ…
ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చేప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముత్తన్నపేటలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీరు చుక్క రాలేదన్నారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇల్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు మాతంగి తిరుపతి, ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు, ఉప్పులేటి శ్రీనివాస్, రవి తదితరులు ఉన్నారు.