ప్రాంతీయం

సముష్టిగా ఉంటేనే ఏదైనా సాధించగలం

158 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం ఏర్పాటుకు గురువారం రోజున ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఇప్పటివరకు మండల సంఘం ఏర్పాటు చేయకపోవడం మరియు మండల స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలంటే మండల సంఘం ఏర్పాటు చేసుకొని ప్రతి స్వర్ణకారుడి సమస్యను పరిష్కరించుకోవడానికి మండల సంఘం ఏర్పాటు చేసుకోవాలని స్వర్ణకార సభ్యులు అన్నారు ఈ నెల 17న విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవం సందర్భంగా రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి స్వర్ణకార సంఘంలో మధ్యాహ్నం 3:00 గంటలకు మండలంలోని ప్రతి ఒక్క గ్రామ స్వర్ణకార సభ్యులు హాజరుకావాలని రాబోయే 31వ(సెప్టెంబర్) తేదీ లోపు ఎలక్షన్లు నిర్వహించుకోవడానికి సమావేశం ఏర్పరచుకొని విధి విధానాల గూర్చి చర్చించుకోవాలని ప్రతి ఒక్క సభ్యుడు తప్పనిసరిగా హాజరై వారి వారి సూచనలు తెలియపరచాలని అన్నారు ఇట్టి ఎలక్షన్ కుగాను ఎలక్షన్ కమిటీ సభ్యులు ఎర్రవెల్లి కృష్ణ, శ్రీ గాధ ధర్మచారి, పలోజి సతీష్, శ్రీ గాద కిషన్, శ్రీరామోజు శేఖర్, శ్రీరామోజు ప్రవీణ్, శ్రీరామోజు సత్యనారాయణ, వంగాల వసంత్ కుమార్, శ్రీరామోజు దేవరాజ్, వంగాల సురేందర్, వంగాల శ్రీనివాస్, వంగాల నరేందర్, దుంపటి కృష్ణమూర్తి, మండోజు రాజేశం, శ్రీ గాద సంతోష్, శ్రీ గాధ అశోక్, చేపూరి శ్రీనివాస్, చేపూరి రమేష్, వంగాల శ్రీధర్, లను ఎలక్షన్ కమిటీ మెంబర్లుగా ఎన్నుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *