Breaking News

పదిరలో రాగి లడ్డూల పంపిణీ

122 Views

సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించగా నేడు పదిర గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రాగి లడ్డులు పంపిణీ చేశారు, గ్రామంలో సుమారు 82 మంది పిల్లలకు రాగి లడ్డులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్లు గంగ లక్ష్మి,సుమలత లు మాట్లాడుతూ.. పోషకాహార విలువలను వివరించుతూ చిరుధాన్యాల ఆవశ్యకత, పోషకాహారం పై అవగాహన, వయసుకు తగ్గ పిల్లలు బరువు ఎత్తు పెరగాలి అంటే సరైన పోషకాహారంతోపాటు ప్రతి సీజన్ లో వచ్చే పండ్లు ఆకుకూరలు, కూరగాయలు మరియు పరిశుభ్రమైన నీరు అందించాలని వివరించారు.ఈసంధర్బంగా cess డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి ప్రతి శనివారం ఇచ్చే రాగి లడ్డులా ఖర్చు ఈ ఆకాడమిక్ ఇయర్ మొత్తం గ్రామములో గల రెండు అంగన్వాడీ పాఠశాలకు అయ్యే రాగి లడ్డుల ఖర్చును ఇస్తాను అని చెప్పడం జరిగింది.ఈ సందర్బంగా మల్లారెడ్డి గారికి అంగన్వాడీ టీచర్లు కృతఙ్నతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ మల్లారెడ్డి, సర్పంచ్ కుంబాల వజ్రమ్మ,ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,ఉపసర్పంచ్ సుదమల్ల సురేందర్, వార్డు సభ్యులు వెంకటస్వామి రామచెంద్రమ్,కార్యదర్శి సారిక అంగన్వాడి టీచర్లు సుమలత,గంగలక్మి ఆశా వర్కర్ పద్మ సీఏ శిరీష మహిళా సమాఖ్య సభ్యులు,అనిత,కవిత పిల్లల తల్లి తండ్రులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7