ముస్తాబాద్ ప్రతినిధి సెప్టెంబర్13, అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు బీసీ విద్యార్థి సంఘం పూర్తిగా మద్దతు సంఘీభావం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ సమ్మె ఆధ్వర్యంలో మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని బీసీవిద్యార్థి సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి రెగ్యులర్ చేయాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. వారి ఉద్యమంలో బీసీ విద్యార్థి సంఘం భాగ్య స్వాములు అవుతామని వారు చేపట్టే ఏకార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాంమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గౌరీ రాకేష్, ముదిరాజ్ కందుకూరి రమేష్, రాజు, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
