Breaking News

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

297 Views

(తిమ్మాపూర్ మార్చి 28)

గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యమైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఎల్ఎండి ఎస్ఐ చేరాలు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని నిర్మాణుషంగా వున్నా పాత పెట్రోల్ పంపు ఆవరణలో మృతుదేహం కనిపించిందని స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో, హుటాహుటిన పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతి చెందిన వ్యక్తి వయసు 40 నుంచి 45 సంవత్సరాలు మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన వ్యక్తి పసుపు రంగు టీ షర్ట్ ,నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతుడి గురించి ఎవరికైనా తెలిస్తే ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కు 8712670770 సమాచారం ఇవ్వాలని కోరారు.

మృతుడు వారం రోజుల నుండి మతిస్థిమితం లేకుండా రోడ్డుపై అటు ఇటు తిరుగుతుండేవాడని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చేరాలు తెలిపారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్