ప్రాంతీయం

గొల్లపల్లిలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

180 Views

 

– గొల్లపల్లి బస్టాండులో శవయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంచిర్యాల కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పులు లేవట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బాధ్యతమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పై తాను అసభ్యంగా ప్రవర్తించి మతిభ్రమించిన బాల్క సుమన్ కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. వెంటనే భేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సాహెబ్,తిమ్మాపూర్ సింగల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, మాజీ ఎంపిటిసి మర్రి నారాయణరెడ్డి, గోగురు శ్రీనివాస్ రెడ్డి, ముచ్చ రాజు రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య నవీన్, పందిళ్ల సుధాకర్ గౌడ్,పాశం నాగిరెడ్డి,ముత్యాల రవీందర్ రెడ్డి,ఎన్నారై మహమ్మద్ లాలా, దాసరి శ్రీనివాస్,భగవంతు రెడ్డి, జనగామ రమేష్,చందర్, ప్రసాద్, చంద్రారెడ్డి, గుర్రాల సత్తిరెడ్డి,సురేందర్, సాయి,కట్కే రవి,దేవరాజు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *