రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 13: బండలింగంపల్లి గ్రామంలో 25 రోజుల క్రితం శ్రీరామోజు రాజేశం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి కుటుంబ దీనస్థితిని చూసి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ స్థితిని చూసి ఎల్లారెడ్డిపేట మండల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం సభ్యులు 9వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కార్యదర్శి కొలనూరి శంకర్ చారి, చెలిమెల ఆంజనేయులు మండల అధ్యక్షులు, వంగాల వసంత్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి ,కంబోజ దేవరాజు కోశాధికారి, శ్రీరామోజు దేవరాజు జిల్లా ప్రచార కార్యదర్శి, మారోజు రాజు సలహాదారులు, మండోజు రాజేశం మండల సలహాదారులు, చెన్నోజు పురుషోత్తం మండల ఉపాధ్యక్షులు పిన్నోజు శ్రీధర్ ఆచారి, మొగులోజు కిష్టయ్య, దుంపేట జనార్ధన్ చారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు, దుంపటి కృష్ణమూర్తి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘ గౌరవ అధ్యక్షులు, ముఖ్య సలహాదారులు మారోజు లక్ష్మీనారాయణ, మరియు బండ లింగంపల్లి విశ్వబ్రాహ్మణులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
