Breaking News

ఎవరు ఈ ప్రవీణ్ కుమార్?

221 Views

 

అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు? అతను ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటున్నారు? సిర్పూర్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? సిర్పూర్ ప్రజలు ఎందుకు ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలి? ఇవన్నీ మన సిర్పూర్ ప్రజలు తెలుసుకోవాలి,అర్థం చేసుకోవాలి,ఆదరించాలి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో ప్రేమమ్మ,సవారన్న దంపతులకు మొదటి సంతానంగా 1967లో జన్మించారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా,ఎన్ని అవమానాలకు గురైనా పట్టువదలకుండా చదివి భారతదేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సంపాదించి 1995లో ఐపిఎస్ అయ్యారు. శిక్షణ పూర్తయిన అనంతరం 1998లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అడిషనల్ ఎస్పిగా పని చేశారు.2001లో కరీంనగర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.పేద వర్గాల నుండి ఎదిగిన వ్యక్తి గనుక,పేద వర్గాల ప్రజలు తప్పుదారి పట్టి,దండకారణ్యంలో చేరితే వేలాది మందిని కలిసి,వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా మార్పు తీసుకువచ్చారు.ఎంతో మందికి ఉన్నత జీవితాన్ని అందించారు.అడవిలో కలిసి విలువైన ప్రాణాలు కోల్పోయి,కుటుంబాలను అంధకారంలో నెట్టివేయొద్దని సూచించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
2009లో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చి వందలమంది విద్యార్థులు ప్రాణాలు బలితీసుకుంటుంటే,ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తూ,
విద్యార్థులతో చర్చించి చాలామంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు.ఆంధ్ర పాలకుల నరియు అధికారుల ఆదేశాలను లెక్కచేయలేదు.ఇషాంత్ రెడ్డి,సిరిపురం యాదయ్య వంటి అమరులను తన చేతులతో మోసిన అసలైన ఉద్యమకారులు మన ప్రవీణ్ కుమార్.
ఉద్యమకాలంలోనే మళ్లీ పుస్తకం పట్టి,ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది రెండేళ్లు చదివారు.
తిరిగి ఇండియా వచ్చిన తర్వాత గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి, కేవలం విద్యతోనే పేదల బతుకులు మకరుతాయని నమ్మి,తొమ్మిదేళ్లు ఉన్నత ప్రశాణాలున్న విద్యను ఉచితంగా అందించి,ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎదుర్కొని పది లక్షల మందిని చదివించారు. ఈయన హయాంలోనే మన సిర్పూర్ నియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి.
వేలాది మంది నిరుపేద బిడ్డలను డాక్టర్లు,ఇంజనీర్లు,పైలెట్లుగా తయారుచేశారు. తొమ్మిదేళ్లు గురుకులాల సెక్రటరీగా పనిచేసి,900 పాఠశాలలు,52 డిగ్రీ కాలేజీలు,7 మహిళా పిజి కాలేజీలు,సైనిక పాఠశాలలు,లా కాలేజీలు ప్రారంభించారు.వేలాది మందిని విదేశీ యూనివర్సిటీలకు పంపించారు.
కేవలం తొమ్మిదేళ్లలో ఒక ఉద్యోగిగా,వెయ్యి కోట్ల బడ్జెట్ తోనే విద్యార్థుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చినపుడు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మొత్తం మన చేతిలో ఉంటే,ఆ బడ్జెట్ లోని ప్రతి పైసా పేదలకోసం ఖర్చు చేస్తే తెలంగాణలో నిరుపేదలు లేకుండా చేయవచ్చునని గ్రహించి, ఫూలే అంబేడ్కర్ కాన్శీరాం గారు చూపిన మార్గంలో నడవడానికి సిద్దమైన ప్రవీణ్ కుమార్ 2021లో తన 26 ఏళ్ల ఉన్నత ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

పేద వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ,పేద వర్గాలకు చెందిన వ్యక్తుల నాయకత్వంలో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీలో ఆగస్టు 8,2021లో రెండు లక్షల మంది సమక్షంలో చేరి,గత 280 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టి ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు.

తను ఉద్యోగంలో ఉన్నప్పుడే ఎన్నో విలువైన జాతీయ అవార్డులు అందుకున్నారు.అవినీతి,అక్రమాలకు పాల్పడలేదు, అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టలేదు.ప్రభుత్వ పెద్దల సూచనలకు,ఆదేశాలకు తలొగ్గకుండా పేద వర్గాల పక్షాన నిలబడ్డ నిజమైన బహుజనవాది.

ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు చేయలేదు,బహుజన బిడ్డలను వేధించలేదు,చట్టవిరుద్ద కార్యక్రమాలకు మద్దతివ్వలేదు.దోపిడీ దొంగలకు సహకరించి కోట్ల ఆస్తులు కూడబెట్టుకోలేదు. సొంతంగా ఇల్లు కూడా కట్టుకోకుండా కిరాయి ఇంట్లో జీవిస్తున్న అత్యంత సామాన్యమైన మేధావి మన ప్రవీణ్ కుమార్.

ఆయన రాబోయే ఎన్నికల్లో మన సిర్పూర్ గడ్డ మీది నుండి,ప్రజలందరి మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. ఆంధ్ర వలస పాలనకు అంతం పలికి,దోపిడీకి గురవుతున్న మన వనరులను రక్షించడానికి,బెదిరింపులు,భయానికి లోనై నివసిస్తున్న ప్రజలకు ధైర్యాన్నివ్వడానికి,అతి ముఖ్యంగా మన సిర్పూర్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అతి తక్కువ సమయంలోనే తనదైన శైలిలో కష్టపడి చేసి,బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ కుమార్ మాయవతి గారి చేత,తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు.
రాబోయే ఎన్నికల్లో దోపిడీ పాలనను గద్దె దించడం కోసం,అణగారిన ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ వర్గాలకు ఏకం చేసి,బిసిలకు 70 సీట్లు ఇచ్చి, కనీసం 20 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
అందుకే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరం ప్రవీణన్న వెంట కదులుదాం. వందకు 99 మందిమి మనమే ఉన్నాం,కానీ కేవలం ఒక్క శాతం ఉన్న దోపిడి వర్గాలకు అధికారం ఇచ్చి అన్యాయానికి గురవుతున్నాం. మన ఓటు మనమే వేసుకుందాం. మన కాంట్రాక్టులు మనమే దక్కించుకుందాం. మన సంపద మనమే పంచుకుందాం. వ్యాపారుల నుండి చందాలు వసూలు వసూలు చేసి,అన్నదాన సత్రాలు నడుపుతూ మోసం చేస్తున్న కుట్రలను తిప్పికొడుదాం.మాకు అన్నదానం వద్దు అధికారంలో వాటా కావాలని గర్జించుదాం.మన ప్రాంతానికి వలస వచ్చి,మన ఓట్లతో గెలిచి,మన అధికారులపైనే దాడి చేసి,మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదాం. చట్టాన్ని,ధర్మాన్ని గౌరవించి,సెక్యులరిజాన్ని కాపాడే ప్రవీణన్నను గెలిపిద్దాం. సిర్పూర్ మారాలంటే ప్రవీణన్న గెలవాలి.
బిసి కులాల బతుకులు మారాలన్నా,మాలిలను ఎస్టీ జాబితాలో కలపాలన్నా,అరె కులస్థులు ఆత్మగౌరవంతో పౌరుషంగా బతకాలన్నా,ఆదివాసుల కష్టాలు తీరాలన్నా,ఎస్సీ,మైనారిటీలు ఉన్నతంగా ఎదగాలన్నా, పేపర్ మిల్లులో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నా బహుజన జెండా ఎగరాలి.
ఆంధ్ర పాలన పోవాలి..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *