తెలంగాణాలో కరెంటు వినియోగదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన
ఫిబ్రవరి 3
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తూ వినియోగదారులకు విద్యుత్తు శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఇక నుండి మీటర్లకు ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవాలటఅలా లింక్ చేసుకోవడం వల్ల పవర్ ఎప్పుడు కట్ అవుతుంది, ఎప్పుడు తిరిగి పవర్ వస్తుంది అనేది మీకు ముందుగా మెసేజి ద్వారా సమాచారం అందుతుంది. అంతే కాకుండా మీ నెలవారీ కరెంటు బిల్లు వివరాలను కూడా ఈ మెసేజి ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్లను లింక్ చెయ్యడానికి. (టీ ఎస్ సౌత్ ఎర్న్ పవర్ .కం) అనే వెబ్ సైట్ ని ఆన్లైన్ గూగుల్ లో సందర్శించాలని విద్యుత్తు శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.
లేదా మీ ఇంటికి కరెంటు బిల్ తీసేవారు వచ్చినప్పుడు అతనికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చు ఈ ప్రక్రియ ని చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది ఏమిటంటే రాబొయ్యే రోజుల్లో కరెంటు కోతలు విపరీతంగా ఉంటాయి అని ప్రభుత్వం ఈ సందేశం ద్వారా చెప్పకనే చెప్తుంది. గత ప్రభుత్వం లో ఎప్పుడో ఒకసారి కరెంటు కోత ఉండేది. కానీ ఇప్పుడు కరెంటు కోత లేని సమయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది.కేవలం రెండు నెలలు మాత్రమే గడిచింది, ఇలాంటివి ఇంకా 5 సంవత్సరాలు జనాలు ఎదురుకోవాలి
