24/7 తెలుగు న్యూస్. సెప్టెంబర్ 13 ఉప్పల్
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోనీ బీరప్ప గడ్డ చిలుక నగర్ బస్తీ దావాఖన లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్థానిక కార్పొరేటర్ బనాల గీత ప్రవీణ్ ముదిరాజ్, వైద్య అధికారులతో కలిసి ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన *ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ప్రతి మంగళవారం ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు సమగ్ర మహిళ ఆరోగ్య పథకం రూపొందించబడిందని దీని ద్వారా సరైన స్క్రీనింగ్ వైద్య పరీక్షలు వ్యాధి నిర్ధారణ చికిత్స మందుల పంపిణీ మరియు ఫాలోఅప్ సేవలు అందించబడతాయని అన్ని వయసులో గల మహిళలకు అందించే 8 రకాల సేవలు 1.డయగ్నోస్టిక్స్ 2.క్యాన్సర్ స్క్రీనింగ్ 3.సూక్ష్మ పోషక లోపాలు 4.మూత్రణాల ఇన్స్పెక్షన్లు 5.కుటుంబ నియంత్రణ రుతు స్రావ సమస్యల నిర్వహణ 6.మోనోపాజ్ నిర్వహణ 7.లైంగిక వ్యాధుల నిర్వహణ 8.శరీర బరువు నిర్వాహణ సర్వీస్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక దినమున మహిళా ఆరోగ్య సేవలు ఉచిత వైద్య వ్యాధి నిర్వహణ పరీక్షలు మందులు నిరంతర రేఫరల్ సౌకర్యం అందించబడతాయని తెలిపారు.. ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ నారాయణరావు, డాక్టర్లు సౌందర్య లత, నేహా, మెడికల్ సూపర్వైజర్ భోగా ప్రకాష్,, బిఆర్ఎస్ నాయకులు డి, గరిక సుధాకర్, పల్లే నర్సింగరావు, కొక్కొండ జగన్, బిఆర్ఎస్ నాయకులు మహిళలు,వైద్య బృందం, సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
