సైబర్ నేరగాళ్ల మోసం తో అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయి…అయ్యా బాబోయ్ అని ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటూ పోలీసులు ని ఆశ్రయిస్తున్న సైబర్ కేసులు కోకొల్లలు….*
*ఇప్పుడు ట్రెండ్ మార్చి వేలి ముద్రలు తో దొంగిలిస్తోన్న సైబర్ నేరగాళ్లు.. క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ! జరభద్రం..ఇలా ఎవరికైనా జరగ వచ్చు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్న …పోలీసులు*
*మన వేలి ముద్ర ఎవరితోనైనా పంచుకున్నమా…ఇక బ్యాంక్ లో మన సొమ్ము గోవిందా…. జర జాగ్రత్త*
బెంగళూరులోని వసంతనగర్‌లో నివాసముంటున్న 57 ఏళ్ల మహిళకు సెప్టెంబర్ 7న ఉదయం తన బ్యాంకు ఖాతా నుంచి రూ.10,000 క్యాష్ విత్‌డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. తాను ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే డబ్బు పోవడం గమనించి వెంటనే తన ఖాతాను తనిఖీ చేసుకుంది. రెండు రోజుల క్రితం మరో పది వేల రూపాయలు కూడా బదిలీ అయినట్లు గుర్తించింది. దీంతో సదరు మహిళ బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆమె వేలి ముద్రల సహాయంతో రూ.20 వేలు ఆధార్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా బదిలీ అయినట్లు తెలిపారు.
