(కరీంనగర్ జిల్లా మానకొండూర్ సెప్టెంబర్ o9)
హైదరాబాద్ నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం బిజెపి రాష్ట్ర నాయకులు, స్థానికుడు మాజీ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మానకొండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ధరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బండి సంజయ్ నాయకత్వంలో కాషాయ జెండా ఎగరవేస్తామని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానాని, దళిత బంధు, పేదలకు డబుల్ బెడ్ రూములు, రైతులకు పూర్తిగా లక్ష రుణమాఫీ అయ్యే అంతవరకు మానకొండూరు నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందే వరకు ఉద్యమాలను చేపట్టి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో చేరేవరకు కృషి చేస్తానని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు, మేధావులు గద్దె దింపడం ఖాయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, బీజేవైఎం కార్యదర్శి బోయిని అభిషేక్, బోయిని హరీష్, కొంకటి అనిల్ తదితరులు ఉన్నారు.