గజ్వెల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పూదరి నందన్ గౌడ్ దరఖాస్తు
దగాపడ్డ పాలనను ప్రాలద్రోలదానికి… ఇన్నేండ్లు దోపిడికి గురైన గజ్వేల్ నియోజకవర్గాన్ని రక్షించడానికి… అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి.. ఖబ్జాకోర్ల చెర నుండి మన గజ్వేల్ కి విముక్తి కల్పించడానికి.. నేను.. మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకొని.. మీ ముందుకు రాబోతున్నాను.. ఆర్&ఆర్ కాలనీ వాసులను మోసం చేసిన ఈ రాష్ట్ర సర్కారును తరిమికొట్టే సమయం ఆసన్నమైంది ప్రజలారా ఒక్క అవకాశం ఇవ్వండి, యువ శక్తి సత్తా చూపుతూ, యువతకి ఉపాధి అనే బలమైన లక్ష్యంతో మరియు నియోజక వర్గ సమూల మార్పులతో కూడిన అభివృద్ధికై.. మన గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికై వస్తున్నా.. నాతో చేతులు కలపండి.. నన్ను ఆశీర్వదించండి.. జై తెలంగాణ . భారత్ మాతా కీ జై
మీ….
పూదరి నందన్ గౌడ్
గజ్వేల్ నియోజకవర్గం




