రాజకీయం

కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం…

80 Views

నిర్మల్ అక్టోబర్ 27: కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం.

రాష్ట్ర ఐటీ శాఖ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆవిలంబిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది.

దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతుబంధు పథకం ని నిలిపివేయాలని ఈసీకి కంప్లీట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మను ఈరోజు బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దహనం చేయడం జరిగింది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్నప్పుడు రైతులకు కరెంటు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు.

దండగ అన్న వ్యవసాయంనీ పండుగ చేసి చూపించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ మనం అందరం రుణపడి ఉండాలని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు భీమా, రైతులకు పంటలకు సరిపడా కరెంటు ఇస్తూ వారికి ఎల్లప్పుడూ నేనున్నాను అని భరోసానిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని మూడోసారి ముఖ్యమంత్రిగా చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *