*ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి*
కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసిన దారుణం స్థానిక కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం
శుక్రవారం ఫ్రెషర్ డే సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన వైనం బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్ల ప్రకటన
కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం ఉంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు తల్లిందండ్రులకు సూచించినా ఆర్థికస్తోమత లేక వారు మిన్నకుండిపోయారు.
