Breaking News

దళిత బంద్ డబ్బులు వెనక్కి ఇవ్వాలి*

90 Views

*దళిత బంద్ డబ్బులు వెనక్కి ఇవ్వాలి*

*దళిత రత్న అవార్డు గ్రహీత చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు గద్దల మహేందర్*

మద్దూరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం లో, లబ్ధిదారుల నుండి ఉమ్మడి మద్దూరు మండలంలో ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో, తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంత్రిగారు స్పందించాలని కోరుతున్నామని, దళిత రత్న అవార్డు గ్రహీత చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు గద్దల మహేందర్ కోరారు. దళితుల అభ్యున్నతి, రాజకీయ, ఆర్థిక, స్వాలంబన కోసం అడుగులు వేస్తున్న క్రమంలో, అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర సర్కారు సంకల్పం వహిస్తే, దాని విధానాన్ని పథకం ఉద్దేశాన్ని నీరుగార్చి, కొంతమంది లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేశారని, బహిరంగంగానే చర్చ జరుగుతున్న క్రమం కనిపిస్తున్న తరుణంలో, ఆ డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని కోరుతున్నాము. లబ్ధిదారులు వడ్డి వ్యాపారుల దగ్గర నుండి తీసుకొని ఇచ్చారని, మిత్తి భారం ఎక్కువైపోయి దిక్కుతోచని స్థితిలో దళితులు కొనసాగుతున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఎమ్మెల్యే  స్పందించి దళిత జాతి ఉద్ధరణకు పథకం లక్ష్యానికి దోహదపడాలని  అభివృద్ధికి కృషి చేయాలని, కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్టి డబ్బులను సకాలంలో తిరిగి ఇప్పించే విధంగా ఎమ్మెల్యే  చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాము.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *