దౌల్తాబాద్ : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన సతీష్ గౌడ్ (20) ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. సతీష్ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడు గతంలో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి నష్టపోయాడని తెలుస్తోంది. సతీష్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
