ప్రాంతీయం

రక్తదానం మహాదానం*

88 Views

రక్తదానం మహాదానం అన్ని దానాలలోకెల్లా రక్తరక్తదానం మహాదానం దానం చాల గొప్పది. ప్రాణాలు కోల్పోయే స్థితి నుండి ఎంతోమంది ప్రాణాలను రక్షించవచ్చు. రక్తదానం చేయడంవల్ల కొత్త  జీవితాన్ని ప్రసాదించవచ్చు.ఈ మాటలకు ఆదర్శంగా నిలిచారు యువ జర్నలిస్ట్ యాదగిరి . బుధవారం పీవీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ గజ్వేల్ లక్ష్మక్క పల్లి ఆర్విఎం ఆస్పత్రిలో బీ నెగటివ్ పాజిటివ్ రక్తం  అత్యవసరం ఉందని ఫోన్ ద్వారా వచ్చిన సమాచారానికి స్పందించి వెంటనే బ్లడ్ బ్యాంక్ వెళ్లి యాదగిరి  రక్తం దానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా కులమత బేధాలు లేకుండా ఎవరికైనా సరే  అత్యవసర సమయంలో రక్తం అవసరం అనే సమాచారం తెలిస్తే  రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలన్నారు. ఓ పేషెంట్ కి అత్యవసరంగా బీ నెగటివ్ రక్తం అవసరం ఉందని తెలియగానే వెంటనే వెళ్లి రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చాలామంది రక్తదానం చేయడం వలన అనారోగ్యానికి గురవుతామని అపోహ పడతారని దీనివల్ల రక్తదానం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. కానీ వాస్తవానికి రక్తం దానం చేయడం వలన  ఎలాంటి అనారోగ్యానికి గురికామన్నారు. మన శరీరంలో ఉండే పాత రక్త కణాలు తొలగిపోయి కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయని వాటి ద్వారా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటామన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఎంతో మంది ప్రాణాలు రక్షించడానికి వీలుంటుందని అలా మన ద్వారా రక్తాన్ని స్వీకరించిన వారు కోలుకొని వారి ముఖములో వ్యక్తం చేసే సంతోషం గొప్ప వరంలాంటిదన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *