-ఆర్థిక సాయం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం
తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మాతంగి సంపత్ ఇటీవల మరణించగా అట్టి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఆల్ ఇండియా యువజన సంఘం నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వంతడుపుల సంపత్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు పనిచేస్తూ సంఘానికి ఎనలేని కృషి చేసిన మాతంగి సంపత్ మరణం మృతి బాధాకరమని అన్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయంగా 6000 రూపాయలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పారునంది జలపతి,కోయడ మురళి,కిన్నెర సతీష్,బొర్రా రవన్న,మాతంగి అశోక్, నగునూరు వంశీ,దుర్గం అశోక్, రచాపెల్లి ప్రసాద్, తాళ్లపల్లి నందకిషోర్,గాజా సాగర్,మారపెల్లి హరీష్,తూర్పాటి అజయ్,ఎలకపల్లి లక్ష్మణ్,సముద్రాల మల్లేష్, అసంపెల్లి అశోక్,దప్పు తిరుపతి,కిన్నెరా అంజి, అల్వాల సంపత్, మేకల సునీల్,కమెర ప్రభాకర్,తాటిపల్లి సంపత్,దుర్గం ఓదయ్య తదితరులు పాల్గొన్నారు.