1001 కి చేరుకున్న పుస్తే మట్టెల వితరణ
నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ…
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ (డబుల్ బెడ్ రూం కాలనికి చెందిన నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి సోమవారం పుస్తే మట్టెలను అందజేశారు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మీ రాజు ల కుమార్తె లావణ్య శిరీష తో ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన దున్నపోతుల కనకవ్వ ఎల్లయ్య ల కుమారుడు రాజు వివాహం సోమవారం జరగగా అట్టి వివాహ కార్యక్రమానికి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి హాజరై పుస్తే మట్టెల ను వారి కి అందజేశారు, అదే విధంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 5116 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు,
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి వారి అత్త మామ కీర్తి శేషులు స్వర్గీయ నేవూరి లక్ష్మీ మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు 1001 పుస్తె మట్టెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు,
మండలంలో ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే వారం రోజుల ముందు పెళ్లి పత్రిక తో వారిని కలిసి నట్లైతే పుస్తె మట్టెలు అందజేయడం జరుగుతుందని దీనిని నిరుపేదలుసద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
ఈ పుస్తే మట్టెల వితరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేగి నరసయ్య , నేవూరి పద్మారెడ్డి, ఎలగందుల నర్సింలు, బాబు , సుంకి భాస్కర్ ఎస్.కె అభీభ్ , కొత్త రాజు , లింగంపల్లి బాపు , శివరాత్రి ఎల్లం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
