వైద్య అధికారుల నిర్లక్ష్యం
డెంగ్యూ మలేరియా టైపాయిడ్ తో ఇంటికి ఒకరు
గ్రామాలలో పారిశుధ్య పనులు సూన్యం
గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి
మంగపేట,సెప్టెంబర్ 06
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పట్టాణలలో గ్రామాలలో ఏజెన్సీ పల్లెలో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున విష జ్వరాలు డెంగీ మలేరియా బారినపడి ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగతూ డబ్బులు ఖర్చు పెడుతున్న చివరకు ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితిలో ప్రజలు ఉన్న వారి ఆరోగ్యంను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి మరి కొన్ని నెలలలో ఎన్నికలు ఉన్నందునా ఎలా గెలవాలి అ ప్రతి పక్షం పార్టీలను ఎలా ఓడించాలనే ఎత్తు గడలా మీద ఉన్న శ్రద్ధ పేద ప్రజలు డెంగీ మలేరియా విష జ్వరాల బారిన పడి లక్షల రూపాయలు ఖర్చు లు పెట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న పేద ప్రజల ఆరోగ్య విషయం పై ప్రభుత్వ హాస్పిటల్ లో మెరు గైన వైద్య సదుపాయాలు కల్పించి తగిన చర్యలు తీసు కోవాలని ఆలోచన లేకుండా పోయిందని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి అన్నారు.బుధవారం యాదగిరి విలేకరులతో మాట్లాడుతు రోజు రోజుకు డెంగీ మలేరియా విష జ్వరాలు పెరిగి పోతున్న వైద్య అధికారులు మాత్రం నోరుమేదపకుండా చోద్యం చూస్తున్నారు నిత్యం ఎక్కడో ఒక చోట డెంగ్యూతో మరణిస్తున్నారని ఆరోగ్య శాఖ అధికారులు డెంగీ మలేరియా విష జ్వరాలు లేవు అని బహ టంగానే ఉంటున్నారని డెంగీ మలేరియా విష జ్వరాలు లేకుంటే వందల మంది జ్వరాన పడిన వారు ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఎందుకు ఉంటు న్నారో వైద్య అధికారులు సమా ధానం చెప్పాలని ప్రశ్నించారు? ఇప్పటికైనా గ్రామాలలో పారిశు ధ్య పనులు వేగవంతంగా చేపట్టి గ్రామాలలో వైద్య కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందు బాటులోకి తెచ్చి పేద ప్రజలకు మంచి వైద్య సౌకర్యాలు కల్పించి డెంగీ మలేరియా విష జ్వరాలు అంటూ వ్యాధులు ప్రభాల కుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి కొరారు.