*అధిక సాంద్రత పత్తి పొలాలు బాగున్నాయి*
మర్కుక్ మండలంలోని వివిధ గ్రామాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న పొలాలు బాగున్నాయని ఈ పద్ధతిలో దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర పత్తి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా. వై.జి ప్రసాద్ ఇ.సి. ఏ.ర్ ఆటారి డిప్యూటీ డైరెక్టర్ డా. ఎ.అర్.రెడ్డి శాస్త్రవేత్తల బృందం తెలిజేశారు. ఆ తరువాత మర్కుక్ రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఈ పద్ధతి ద్వారా సాగు చేసే పొలాలను పాముల పర్తి, మర్కుక్, నరసన్నపేట, ఎర్రవల్లి లో సందర్శించారు. ఈ పద్ధతిలో సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 6000 రూపాయలు వారి ఖాతాలలో వేస్తుంది అని తెలిజేశారు. డా. వై.జి ప్రసాద్ ప్రత్తి శాస్త్రవేత్త మాట్లాడుతూ
ఈ పద్ధతిలోని వంగడాలు పంట కాలం తక్కువగా ఉండటం వల్ల కాయలు మరియు పూత తొందరగా మరియు 20 నుండి 30 వరకు వస్తున్నాయి. మొక్కలు ఏపుగా పెరగకుండా మేపిక్వాట్ క్లోరైడ్ అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు.
ఈ పధ్ధతి సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని డా. రామ కృష్ణ మాట్లాడుతూ ఎకరాకు 25-30 కేజీ ల యూరియా 15 కిలోల పోటాష్ ఎరువులను వేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్
సాధారణంగా హైబ్రిడ్ వంగడాలను రైతులు ఎకరానికి 4938 మొక్కల నుండి 7407 మొక్కల సంఖ్య ఉండటం వలన మొక్కలు బాగా పెరగడం పెరగడం, పంటకాలం పెరగడం, తద్వారా గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువ కావడం వలన ఆశించిన మేరకు రావడం లేదు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారి టి.నాగేందర్ రెడ్డి కెవికె శాస్ర్తవేత్తడా.రవి , రాశి కంపెనీ ప్రతినిధులు నవీన్ రావు , నూజివీడు ప్రతినిధులు నర్సిహ్మారెడ్డి,
వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణు వర్ధన్, రైతు గణేష్ మరియు,రైతులు పాల్గొన్నారు.
