కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులకు యూరియ కష్టాలు- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ నాయకులు.
మంచిర్యాల జిల్లా.
రైతులు ఎదుర్కొంటున్న యూరియ సమస్యను పరిష్కరించి రైతులకు యూరియ అందుబాటులోకి తేవాలని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల పూర్తి రుణ మాఫీ, కౌలు రైతులకు 12 వేల రూపాయల, మహిళలకు నెలకు 2500 రూపాయలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు లక్షట్టిపేట పట్టణం లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రఘునాథ్ వెరబెల్లి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్కూర్ చౌరస్తాలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం ఉత్కూర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయానికి వరకు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ గా వెళ్లి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంగా వల్లనే ఈరోజు రైతులకు యూరియ దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కృత్రిమంగా యూరియ కొరత సృష్టించి రైతులకు అధిక ధరలతో అమ్ముతున్నారని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గ రైతులకు సరిపడా యూరియా ఆడించడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిన ఇప్పటి వరకు మహిళలకు నెలకు 2500 రూపాయలు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలుకు నోచుకోలేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని అదే విధంగా రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వీరమల్లు హరి గోపాల్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, ఎనగందుల కృష్ణ మూర్తి, ముత్తె సత్తయ్య, రమేష్ జైన్, గుండా ప్రభాకర్, బొప్పు కిషన్, బియ్యాల సతీష్ రావు, మాధవరపు వెంకట రమణ రావు, సామ వెంకట రమణ, బొక్కనపల్లి సతీష్, రాజేందర్, రాజా గురువయ్య, వేముల మధుకర్, తులసి, తోట సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.





