కామ్రేడ్ మల్లెపల్లి ప్రబాకర్, బుద్ద సత్యనారాయణలపై జనశక్తి మాఫియా ముఠా చేస్తున్న తప్పుడు ఆరోపణలను వెంటనే మానుకొండి.
కూర రాజన్న అనుసరించిన దివాళా కోరు హత్యా రాజకీయ విధానాలపై నిజాయితీగా ఆత్మవిమర్ష చేసుకొని, బహిరంగ క్షమాపణలు చెప్పాలి
దారి తప్పుతున్న రాజకీయాలను ప్రశ్నించిన పార్టీ క్యాడరుపై మరియు ఎం.వి.ప్రసాద్, వసంతక్కలపై కక్ష్యగట్టి జనశక్తి ముసుగులో హత్యలకు, బౌతిక దాడులకు గురిచేసిన వారందరు కూడ నిజమైన విప్లవకారులే.
సిద్దిపేట జిల్లా జూన్ 21
అమరుడు కామ్రేడ్ ఎం.వి.ప్రసాద్ పై మరియు పార్టీ జాతీయ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్, అధికార ప్రతినిధి బుద్ద సత్యనారాయణలపై జనశక్తి మాఫియా ముఠాలు ములుగు, రాచకొండ జోనల్ కమిటీల గోదావరి, మహేష్ పేర్లతో శోషల్ మీడియాలో అవాకులు, చెవాకులతో కూడిన అతకని , పొతకని విమర్షలు, అవగాహన లేని వారి రాజకీయ దిగుజారుడు విధానాలకు అద్దంపడుతుంది. జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు, కరీంనగర్ లో పార్టీ తుపాకులను, క్యాడరును రాజ్యానికి పెద్దసంఖ్యలో సరెండర్ చేసిన పెద్దద్రోహి, కోవర్ట్ రణదీర్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ ముఠా చెప్పగలదా? పార్టిలో ముందుకు వచ్చిన సిద్దాంత, రాజకీయ, నిర్మాణ పరమైన ప్రజాస్వామికమైన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎం.వి.ప్రసాద్ నిలదీయడం ద్వారానే కదా కూర రాజన అహం దెబ్బతిన్నది. ఆధిపత్య, నిరంకుశంతో లేనిపోని పసలేని ఆరోపణలతో ఎం.వి.ప్రసాద్ పై అబండాలు మోపి, అతని సహచరిని కూడా అత్యంత కిరాతంగా పొట్టన పెట్టుకున్నారు. ఎం.వి.ప్రసాద్ రణదీర్ కంటే పెద్దద్రోహి అయితే కాదుకదా? ఇలా పార్టిలో దారి తప్పిన రాజకీయ సంక్షోభాలపై నిలదీసిన ప్రతిఒక్కరిని కోవర్టు, ఇన్ ఫార్మార్, పార్టీ, ప్రజా వ్యతిరేకి, అరాచకుడు అనే పేర్లతో విప్లవానికే తమ జీవితాలను అంకితం చేసిన వారిని అతి క్రూరంగా హత్యలకు, దాడులకు ఉసిగొల్పింది కూర రాజన్ననే కదా? వాస్తవాలు ఎంత దాచిన దాగవు. అది ఏదో ఒకరోజు భయట పడక తప్పదు. సిపిఐ(ఎం.ఎల్) జనశక్తి (కె.రాంచంద్రన్), సిపిఐ(ఎం.ఎల్)క్రాంతి, సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన మూడు విప్లవ సంస్థలు సూత్రబద్దంగా గత 9 సంవత్సరాలుగా కలిసి పనిచేశాయి. 2023, డిసెంబర్-30, 31, హైదరాబాద్ లో జరిగిన రెండు రోజుల ప్లీనరీ సమావేశంలో సిపిఐ(ఎం.ఎల్) సిపి పార్టీగా ఏర్పడింది. పార్టీ కేంద్ర కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్, అధికార ప్రతినిధిగా బుద్ద సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. రాజ్యాహింసకు, పౌర-ప్రజాస్వామిక హక్కుల కొరకు ముందు నిలిచి ప్రశ్నిస్తున్న వారిపై బురదజల్లె కుట్రలకు పాల్పడుతున్నారు. కామ్రేడ్ ఎం.వి.ప్రసాద్, వసంతక్కల 19 వర్ధంతి సందర్భంగా విప్లవోద్యమంలో కూర రాజన్న అనుసరించిన రాజకీయ, నిర్మాణ తప్పిదాలు, పొరపాట్లపై ఆత్మవిమర్శ చేసుకొని, విప్లవ ప్రజానీకానికి బహిరంగ క్షమాపణలు చెప్పి, బలమైన విప్లవోద్యమ నిర్మాణానికి పాటుపడాలని సూచించింది. అదే జనశక్తి పార్టీ శ్రేణుల్లో నేరమైంది. ఏదో ఘోరాలు, నేరాలు చేసినట్లుగా తప్పడు ఆరోపణలతో ములుగు, రాచకొండ జోనల్ కమిటీల పేర్లతో కూర రాజన్న చేయిస్తున్న బెదిరింపులను, అసత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. తమ ఉనికిలో బాగంగా బతుకు దేరువుకోసం ఇలాంటి ప్రజా, విప్లవ వ్యతిరేక ప్రకటనలతో దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా. మల్లెపల్లి ప్రబాకర్, బుద్ద సత్యనారాయణల పైననే గాకుండా, వీరి విధానాలను ఎంగట్టీన వారిపై కూడ అకారణంగా నిందించి, బెదిరింపులకు గురిచేయడం జనశక్తి ముఠాకు వెన్నతోపెట్టిన విద్య.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నీతులు వల్లిస్తున్నారు. సెటిల్ మెంట్లు, రియల్ ఎస్టెట్ అక్రమ దందాలకు తెగబడి, ఆర్థిక నేరగాళ్ళుగా చెలామణి అవుతున్నవారే సుద్దులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రతిఘటన పోరాటంలో పాల్గొనని, నిర్మాణాలు చేయడం ఎరుగని, వ్యక్తిగత జీవితాలకు అలవాటు పడి, ఆర్థిక నేరగాళ్లు గత నాలుగు సంవత్సరాలుగా విప్లవ కారుల ఐక్యతకు క్రుషిచేస్తున్న కూర రాజన్నపై విఛ్చిన్నకర శక్తుల చర్యను ఖండిస్తున్నట్లు ప్రకటనలు. మొగుణ్ణి కొట్టి వీధి కెక్కినట్లుగా ఉంది వీరి వ్యవహారం. 1988 లో పంజాబ్ ప్రభుత్వం తో లైసెన్స్ తుపాకులు తీసుకుని ప్రతిఘటన పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్పిన వీరు… ప్రతిఘటన పోరాట నిర్మాణం గురించి బోదిస్తున్నారు. అసలు సిపి నిర్మించిన ప్రతిఘటన పోరాటానికి తిలోదకాలు పట్టించి, పార్టీని, విప్లవోద్యమాన్ని సంక్షోభానికి గురిచేసి నీతులు వల్లిస్తున్నారు. వివిధ ఎం.ఎల్ గ్రూపులను ఏర్పాటు చేసి, జనశక్తి పార్టీగా ఏర్పడ్డది ఎంత నిజమో? అంతకంటే ఘోరంగా ముక్క చెక్కలై విచ్చిన్నమవ్వడానికి కారణం కూర రాజన్ననే అనే విషయం నిజం కాదా? ఎందుకంటే? కూర రాజన్న, రాంచంద్రన్ రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయిందని, తాను రాంచంద్రన్ వర్గంలో ఉన్నట్లు ఎం.వి.ప్రసాద్ తప్పుడు వార్తను అందించాడని, అందుకే పార్టీ సీరియస్ గా తీసుకొందని, అందుకే ఎం.వి. ప్రసాద్ ను రాజకీయ కోవర్ట్ గా మారడం వలనే మట్టుబెట్టమని చెప్పుకుంటున్నారు. నిజమే కదా! రాజన్న, రాంచంద్రన్ కలిసి లేరు. వారు విడివిడిగానే ఉన్నారు. ఎం.వి.ప్రసాద్ తాను రాంచంద్రన్ వర్గం పక్షానే ఉన్నానని చెప్పడం రాజ్యం ప్రేరేపించిన ద్రోహి ఎలా అవుతాడో? జనశక్తి ముఠానే చెప్పాలి. నిజం గడప దాటక ముందే, అబద్దం ఆరు ఊర్లను చుట్టేసి వచ్చినట్లుగా ఉంది జనశక్తి ముఠా వ్యవహారం. గత 19 సంవత్సరాలుగా ఎం.వి.ప్రసాద్ పై ఇలాంటి అబద్దాలతోనే విషం చిమ్ముతున్నారు. నిజంగా ఎం.వి. ప్రసాద్ హత్యకు కారణమైనవారు జైలులో ఉండేవారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఎం.వి.ప్రసాద్ అభిమానులు సాక్ష్యం చెప్పలేదు. వారికి విప్లవాన్ని ప్రమించడమే తెలుసు. అందుకే వారు జనశక్తి ముఠా అనుసరించిన కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు. ఇకమీదటనైన అబద్దాలకు కాలం చెల్లిందని ఈ ముఠా గ్రహించాలి. మాఫియా ముఠా చర్యలకు, బెదిరింపులకు విప్లవ ప్రజానీకం బయపడే పరిస్థితి లేదని గుర్తించాలి. ఇలాంటి తప్పుడు, పరనింద ఆరోపణలు కొనసాగిస్తే, అదే విప్లవ ప్రజానీకం క్షమించదని, తగిన బుద్ది చెప్పగలదని హెచ్చరిస్తున్నాము. నిజంగా జనశక్తి పార్టీ విప్లవ కారుల ఐక్యతకు, ఒకే సిపిఐ(ఎం.ఎల్) నిర్మాణ ఐక్యతకు క్రుషి చేస్తున్న వారైతే, బేషరతుగా విప్లవ కార్యచరణలో జరిగిన తప్పిదాలు, పొరపాట్లపై ఆత్మవిమర్శ చేసుకొని, బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలి. అందుకు మా సిపి పార్టీ కూడ మీ క్రుషిలో బాగమవుతుందని ప్రకటిస్తున్నాము.
ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఇలాంటి ముఠా చేసే ఆరోపణలను ఎండగట్టి, విప్లవోద్యమ నిర్మాణానికై క్రుషిచేస్తున్న సిపి పార్టీకి అండగా నిలబడాలని కోరుతున్నాము.





