Breaking News రాజకీయం

కొందరి స్వలాభం కోసం బీసీ ల ఐక్యత రాగం.

68 Views

■కొందరి స్వలాభం కోసం బీసీ ల ఐక్యత రాగం.
◆ బీసీ లలో చిచ్చు పెడుతున్న రాజకీయ నిరుద్యోగులు.

●బీసీలకు పెద్ద పీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.

ఈరోజు గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొందరు వారి స్వలాభం కోసం మాత్రమే బిసి రాగం ఎత్తుకున్నారని గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, కొండపాక్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు ర్యాగాళ్ల దుర్గయ్య లు అన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎన్నికలు రాగానే కులాలు గుర్తుకు వస్తాయి వ్యక్తిగత రాజకీయ లబ్ధి పొందడం కోసం కొంతమంది వ్యక్తులు నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించి జడ్పిటిసిలుగా,మున్సిపల్ చైర్మన్ గా పదవులు అనుభవించిన వాళ్లే ఈరోజు బిసి లతో రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబ్బండ వర్గాల సంక్షేమం ద్వేయంగా పరిపాలన చేస్తున్నారని అన్నారు.పదవులలో ఉన్నప్పుడు వారికీ బీసి లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు
పదవులు ఐపోగానే నాయకులకి వీరికి ప్రేమ పుట్టుకొస్తుంద అని అన్నారు. రాజకీయంగా కొంతమంది లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్నటువంటి కుట్ర ఇది వారికి రాజకీయ పదవులు మళ్ళీ రాలేదని ఇవన్నీ చేస్తున్నారని బీసీలు ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇన్ని రోజులు పదవులు అనుభవించినవాళ్ళు బీసీల కోసం ఎం చేశారో చెప్పాలని అన్నారు. ఎన్నికలు రాగానే ఏదో ఒక రాగం ఎత్తుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మీ మాటలను గజ్వేల్ నియోజకవర్గ బహుజన బిడ్డలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత రాజకీయంగా బీసీలు ఎదగాలనే ఉద్దేశంతో మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు తీసుకురావడం బీసీ బందు ప్రవేశపెట్టడం నేతన్నలకు పింఛను, గౌడ్ అన్నలకు పింఛను, వైన్సు టెండర్లలలో గౌడ్స్ కి రిజర్వేషన్లు కలిపించి వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న విషయాన్ని వారు స్పష్టంచేశారు. ముదిరాజులకు చేపల పంపిణీ, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమలను చేపట్టి బీసీల ఆర్థికబివృద్ధి కోసం కెసిఆర్ గారు కంకణ బద్ధులై పనిచేస్తున్నారని అన్నారు ..గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కుల వృత్తులను కడుపులో పెట్టుకొని చూస్తూనే వారికోసం వివిధ పథకాలు తీసుకొచ్చి వారికి పెద్ద పీట వేసిన విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవలన్నారు. బీసీల కోసం ఎన్నో చేపట్టిన ఘనత కేసీఆర్ గారిదే అన్నారు, అన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు ఎటువంటి అవాంతరాలు లేకుండా అవినీతికి తావు లేకుండా అందుతున్నాయని అన్నరూ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ప్రజలు అందరు సంతోషంగా ఉన్నారని కేవలం పదవులు అనుభవించి ఇప్పుడు ఖాళీగా ఉన్న కొందరు నేతలు మాత్రమే బిసి లలో చిచ్చు పెట్టి లబ్ది పొందాలని చూసే వీరిని నమ్మొద్దని హితవుపలికారు. అతి త్వరలో గజ్వేల్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సభ నిర్వహించి నిజమైన బహుజన వాదులు ఎవరో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం అన్నారు.
గజ్వేల్ అభివృద్ధి మా ముఖ్యమైన ఎజెండా అని నియోజకవర్గ అభివృద్ధికై ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న అడుగుజాడల్లో వారి కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.బహుజన వర్గాలకు అండగా నిలబడతాం అని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు,మేకల కనకయ్య,మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మత్పల్లి సర్పంచ్ బచ్చలి మహిపాల్, మంగోల్ సర్పంచ్ కిరణ్, దర్గా సర్పంచ్ శ్రీనివాస్, బోబ్బాయిపల్లి సర్పంచ్ కొళ శ్రీనివాస్, కుకునూరు పల్లి ఎంపీటీసీ భూములు గౌడ్, రామచంద్ర పూర్ సర్పంచ్ కనకయ్య, రాయవరం సర్పంచ్ కనకారాజు, తుమ్మల కనకయ్య ఎంపీటీసీ, సాయిని మహేష్,మాజీ కో ఆప్షన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు ఉమర్,కె. రాజు, నర్సింహులు గౌడ్, కృష్ణ గౌడ్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *