మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
చేగుంట మండల కేంద్రంలోని మండల వద్ద సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించిన ఉపాధ్యాయ సంఘం నాయకులు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి రఘురాములు పాల్గొన్నారు.ఈ సందర్బంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధ కృష్ణ1888 సెప్టెంబర్ 5న వీరస్వామి సీతమ్మ దంపతులకు పుట్టిన మహానుభావుడని, ఉపాధ్యాయ వృత్తి నుండి భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గాను, తర్వాత రాష్ట్రపతిగాను దేశానికి ఎన్నో సేవలు అందించారు అని, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మింపబడుతుందని, ఆయన 77 వ జన్మదినాన్ని పురస్కరించుకొని 1962 సెప్టెంబర్ 5 నుండి దేశమంతా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ సంఘ నాయకులు రావుల వెంకటేష్, మనోహర్ రావు , నాగరాజ్, చల్లా రామకృష్ణ, పెంటా గౌడ్,రేఖ,జగన్ లాల్, బాలచంద్రం,పాండు, వారాల నర్సింలు, సిద్ధిరాంలు, యాదగిరి, సత్యనారాయణ, పరమేశ్వర్ రెడ్డి, విజయ్ సేనా రెడ్డి ఉపాధ్యాయలు , చరణ్,విజయ కుమారి, మంజులత, స్వప్న,తదితరులు పాల్గొన్నారు.
