తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన దుండే మల్లేశం హెడ్ కానిస్టేబుల్ ఇటీవల కాకతీయ కాలువలో పడి మృతి చెందిన విషయం విదితమే. సోమవారం వారి స్వగృహాంలో దినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గోని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించి వారి ప్రగాడ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధైర్యపడవద్దని కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు..