జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (వాల్మీకి పురం) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు ఆదివారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు మధ్య ఉదయం 8 గంటలకు సేశాకాలం, ప్రాబోధ ఆరగింపు, ఉ. 9.00 గం. చతుస్థానార్చన, స్వస్తివాచనం, పంచగవ్యాధివాసం, మృత్తికాదివాసం పంచవింశతా, కలశాభిషేకం, అష్టధాన్యతృష్టి, నాయనోన్మాలినం. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నివేదన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావు దంపతులు, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య దంపతులు, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ, ఎసిపి, కాంట్రాక్టర్ కోడూరు నర్సింహా రెడ్డి దంపతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం 5.00 గంటలకు “శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారికి” గ్రామ శివారు నుండి పూర్ణకుంభ స్వాగత సత్కారములతో ఆహ్వానించడం. మంగళ వాయిద్యాలు, శ్రీ లక్ష్మీ విష్ణు సహస్రనామ సహీ రామ రక్షా స్తోత్ర పారాయణాధులు, కళాన్యాసి, మూర్తివ్యాహిమాలు, ధాన్య, ఫల, పుష్ప, శయ్యధివాసం.
రాత్రి 9 గంటలకు నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్ఠి జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, వారి కుటుంబ సభ్యులు, పాలకుర్తి శ్రీ సోమేశ్వర, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిణి లక్ష్మీ ప్రసన్న, డీ అర్ డీ ఓ రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగా చారి, వల్మీడి దేవస్థాన చైర్మన్ జై హింద్, ఆలయ పాలక మండలి సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, సర్పంచ్ సైదులు, ఎంపీటీసీ సోమ నారాయణ, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ముందుండి ఈ కార్యక్రమాలు అర్చకులతో నిర్వహింపచేశారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు లు మాట్లాడుతూ, ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టం అన్నారు. కోరిన కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారంగా ఈ దేవాలయం విరాజిల్లాలని ఆకాంక్షించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
కాగా,
జిల్లా పౌర సంబంధాల శాఖ అధ్వర్యంలో ఇదే ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
కాగా, మూడో రోజు కార్యక్రమాల అనంతరం నివేదన, మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్టి జరిగింది.
రేపటి కార్యక్రమాల వివరాలు:
ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలు, నిత్య సేవాకాలం, ప్రాబోధికి, ఆరగింపు ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహుతి, గర్త విన్యాసం, ఉదయం 7 గం. 30 నిమిషాలకు శతభిష యుక్త మిధున లగ్నమున “శ్రీ చిన్నజీయర్ స్వామివారి కరకమలములచే యంత్ర ప్రతిష్ట, ప్రోక్షాక అన్ని మూర్తులు, ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, దిష్టికుంభ ప్రధమ ఆరాధన, శాత్తమొర్తే.
“శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణం, పండిత సన్యాసం, యజపోనులకు, గ్రామస్తులకు, ప్రముఖులకు ఆశీర్వచనం ప్రతిష్టా సమాప్తి
“ అందరూ ఆహ్వానితులే”
*మధ్యాహ్నం 1.00 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం* ఉంటుంది.
================




