దుండిగల్ లో అమ్మవారి జాతరకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో ఈరోజు జరిగిన శ్రీరాజరాజేశ్వరి పోచమ్మ అమ్మవార్ల జాతరకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ దుండిగల్ వాసులంతా కలిసికట్టుగా ఉండి ఆలయాలు నిర్మించడం గొప్ప విషయమన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.*
