రాజకీయం

లింగాపూర్ గ్రామంలో పలు కులసంఘ భవనాలను ప్రారంభించిన..ఎమ్మెల్యే

301 Views

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగపూర్ గ్రామంలో పలు కులసంఘాలు రూ.9.20 ల తో ఎస్సీ కమ్యూనిటీ హల్, రూ.9.68 లతోయాదవ సంఘం భవనం,రూ.6.68 ల తో రజక కమ్యూనిటీ భవనాలను ఆదివారం ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ గత పాలకులు చేయని అభివృద్ధిని, అన్ని గ్రామాలలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటి భవనాలను నిర్మించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.బుడగ జంగాల వారికి అదనంగా గృహలక్ష్మి పథకం కింద ఐదు ఇండ్లను ఎక్కువగా మంజూరు చేస్తానని సిసి రోడ్డు నిర్మాణం, కరెంటు సదుపాయం కల్పిస్తానని తెలిపారు. ఇప్పటికే ఈ గ్రామంలో కళ్యాణ మండపంతో పాటు సబ్ స్టేషన్ ను నిర్మించినానని తెలిపారు.అదేవిధంగా ఎస్సీ కమిటీ హాల్ కు సిసి రోడ్డు నిర్మాణంతో పాటు కాంపౌండ్ వాల్, కరెంటు సదుపాయాన్ని కల్పిస్తానని తెలిపారు. బుడగ జంగాల వారికి కులం సర్టిఫికెట్ ఇవ్వకున్నా కూడా వారికి దగ్గరుండి కులం సర్టిఫికెట్ ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.మరోసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని మూడవసారి కూడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొల్సాని మురళీధర్ రావు, మానకొండూరు జెడ్పిటిసి తాల్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామ ఎంపీటీసీ పొల్సాని కవిత పితంబర్ రావు, ఎస్సీ సంఘం అధ్యక్షులు గాలి పెళ్లి రమేష్, యాదవ సంఘం అధ్యక్షులు దాడి ఆంజనేయులు, రజక సంఘం అధ్యక్షులు విశ్వనాథం,నాయకులు ఆలేటి వీరేశం, ఆలేటి సంపత్, ఆలేటి రాజయ్య, గాలిపెల్లి కొమురయ్య, వార్డు మెంబర్ దాడి ఎల్లయ్య, పంచాయతీరాజ్ ఏఈ మల్లేశం, మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ ,వివిధ కులసంఘాల నాయకులు , వివిధ గ్రామాల బీఆర్ఎస్ శ్రేణులు,తదితరులు పాల్గోన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *