మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కవ్వంపల్లి సత్యనారాయణ కి కాంగ్రెస్ శ్రేణులు మహిళలు మంగళ హరతులతో డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం బస్టాండ్ కూడలిలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాలల్లో ప్రజలను కాంగ్రెస్ నాయకులను భయా బ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు.స్థానికేతర ఎమ్మెల్యే టూరిస్ట్ వీసా మీద వచ్చిన ఎమ్మెల్యేకు వీసా కాలం ముగిసింది అని త్వరలో మానకొండూర్ నియోజకవర్గం నుండి ప్రజలు తరిమి కొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.
నేను రాజకీయాల్లో వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజా సేవలో నియోజకవర్గంలోని ఎంతోమంది పేద ప్రజలకు తోచిన సాయం అందిస్తూ గెలుపు ఓటమిలకు సంబంధం లేకుండా ప్రజా సేవలో ఉన్నానని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ,ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5లక్షల ఆర్థిక సహాయం 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..