Breaking News

ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటనకు *ఎమ్మెల్సీ కవిత*

107 Views

, న్యూజిలాండ్‌లో బోనాలు పండుగలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జులై 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ లో, జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో బోనాలు

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఏప్రిల్ 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలకు ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.

జులై 16 న ఆక్లాండ్ లో పాల్గొననున్న కల్వకుంట్ల కవిత

అలాగే జులై 16న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాల వేడుకలో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాలు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆక్లాండ్ లోని గణేష్ టెంపుల్ లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

అలాగే ఆక్లాండ్ లో ఉదయం 9 కి భారత జాగృతి న్యూజిలాండ్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనం లో శ్రీమతి కవిత పాల్గొంటారు.

సాయంత్రం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో ఆక్లాండ్ లోని తెలంగాణీయులతో సమావేశం అవుతారు. ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *