02సెప్టెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం రోజున ఎమ్మార్వో ఆఫీస్ ముందు అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమోరండం ఇచ్చారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ అర్హులైన పేదలు అనేక సంవత్సరాల నుండి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పేదవాళ్ల బతుకులు మారలేదని ఇప్పటికైనా బీరప్ప గుడి దగ్గర ఇంటి స్థలాలు మిగిలినవి అర్హులకు ఇవ్వాలని పేదలను ఆదుకోవాలని గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు అర్హులైన పేదలకు గృహలక్ష్మి పథకాన్ని అన్ని కులాలలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కార్యక్రమంలో సిపిఐ నాయకులు చౌడబోయిన పరుశరాములు తెడ్డు ఆంజనేయులు కిష్టయ్య నల్ల అందాలు యాదపాక లక్ష్మి ఆలేటి పువ్వులమ్మ జంగ సరళ తుమ్మ నాగమణి బాలమణి జాంగిర్ బి ఎర్ర సీమన్ తదితరులు పాల్గొన్నారు





