(మానకొండూర్ జూన్ 25 )
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
అయితే తాను గుండెపోటుకు గురైనట్టు
జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని,వదంతులు నమ్మొద్దంటూ కవ్వంపల్లి ఓ వీడియోను రిలీజ్ చేశారు.
తన ఆరోగ్యం విషయంలో మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోమవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించారు.
వైద్యుల సూచనల మేరకే మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయానని ఎమ్మెల్యే తెలిపారు.