Breaking News

విజయవాడ :చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడు పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – ఆం.ప్ర. పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్.

94 Views

 

 

???????? *చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడు పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – ఆం.ప్ర. పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్*.

???????? *కోకా ప్రకాష్ నాయుడు పై దాడి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని వెంటనే సస్పెండ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తాం – రాజేంద్రప్రసాద్*

???????? *రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన మా గ్రామపంచాయతీ నిధులు మాకు ఇవ్వమని అడిగితే పోలీసులతో మా సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షునిపై దాడి చేయిస్తారా – ఆం.ప్ర. సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు*

???????? బంగారు పాల్యం _మండల పరిషత్ సర్వసభ్య_ సమావేశంలో సర్పంచుల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మా సర్పంచ్ పై సి.ఐ దాడి చేయడం అమానుషం – రాజేంద్రప్రసాద్.

???????? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మా సర్పంచులు మండల పరిషత్ సమావేశంలో మా సమస్యలు చెప్పుకోవడం రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు- ఆ హక్కును ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుంది – రాజేంద్రప్రసాద్.

???????? 14,15 వ ఆర్థిక సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పంపించిన రూ,,8629 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేస్తే, మా నిధులు తిరిగి ఇమ్మనడం నేరమా – రాజేంద్రప్రసాద్.

???????? పోలీసులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ మా సర్పంచుల జోలికి వస్తే మా తడాఖా ఏంటో చూపిస్తాం – రాజేంద్రప్రసాద్ హెచ్చరిక.

???????? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12918 మంది సర్పంచులు రాజకీయాలకతీతంగా ఐక్యమై మా సమస్యలపై పోరాడి, మా గ్రామాల్ని అభివృద్ధి చేసి, మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసిన మా గ్రామీణ ప్రజల రుణం తీర్చుకుంటాం – లక్ష్మీ ముత్యాలరావు.

???????? *మా చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడుకి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి – వై.వి.బి. రాజేంద్రప్రసాద్*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *