*సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి*
– డిబీఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్.
డీబీఎఫ్, బామ్ సేఫ్,దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు సామాజిక పరివర్తన పాదయాత్రను దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని డిబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, బామ్ సేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాంపల్లి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులు,చట్టాలు ముఖ్యంగా ఓటు హక్కు వంటి సామాజిక అంశాలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల పై ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు సామాజిక పరివర్తన పాదయాత్ర దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొని ప్రారంభిస్తారు. ఈ పాదయాత్రలో భాగంగా గ్రామాలలో ప్రజా సమస్యలు, రైతులు, కూలీలు, విద్యార్థులు, ఉద్యోగలు, మహిళలు వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల హాస్టలలు సందర్శించి విద్యార్థుల సమస్యలను, సౌకర్యాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. సామాజిక పరివర్తన పాదయాత్ర దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలలో చేపట్టడం జరుగుతుందని,ఈ పాదయాత్రకు దళిత బహుజన,ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అన్ని వర్గాల మద్దతిస్తూ సహకారం అందించి విజయవంతం చేయడానికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టరాజు, కోశాధికారి నర్సింలు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సాయిలు, సీనియర్ జర్నలిస్టు శంభు లింగం, బొల్లం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.