సమాజం ఎప్పుడూ రెండు వర్గాలుగా ఉంటుంది. మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు.
దేశంలో అరాచకం రాజ్యం ఏలుతోంది…
ఎప్పడూ లేనటువంటి ద్వేషం, ప్రజల మధ్య దూరం, అందులో నుంచి పుట్టకు వచ్చినటువంటి దౌర్జన్యo, ఆ అన్యాయాన్నీ హర్షిస్తూ ఒక వర్గం.
అన్యాయo, దౌర్జన్యం ఒక చోట ఆగవు, ఒక వర్గానికి పరిమితo కావు.
బుల్డోజర్ ముస్లింల పై ప్రయోగిస్తే బీజేపీ అభిమానులు అందరూ హర్షిoచారు. ఆ అన్యాయమే ఇప్పుడు బీజేపీ పాలకులకు, నాయకులకు అస్త్రం అయ్యింది. మొన్న లక్నో మేయర్, ఎవరినో పరామార్శిoచడానికి ఆసుపత్రికి వెళ్ళింది. ICU లోకి చెప్పులతో ప్రవేశం లేదు అన్నారు అక్కడి సిబ్బంది. అంతే ఇంత ఎత్తున లేచింది ఆవిడ. నాకే ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్లకూడదో నియమాలు పెడుతారా. బుల్డోజర్ తో ఆసుపత్రిని కూల్చేస్తా అంటూ బుల్డోజర్ ను రప్పిoచారు…ఆసుపత్రి సిబ్బంది కాళ్ళ వేళ్ళ పడితే, కనికరించి, మర్యాదగా నడుచుకోండి అంటూ హుకుం జారీ చేసి, వెళ్లారు..
ఆ ఆసుపత్రి హిందువు లదే, అక్కడున్న సిబ్బంది కూడా హిందువులే, బహుశా అక్కడ వైద్యం పొందుతున్న వారు కూడా హిందువులే ఎక్కువగా ఉండి ఉంటారు..ఒక వేళ ఆవిడ అహం చల్లారక ఆ ఆసుపత్రి కూల్చి ఉండి ఉంటే? సిబ్బంది, డాక్టర్లను వదిలేయండి…ఆక్కడ చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి ఏంటి? ఎంత ఇబ్బంది పడే వారు, చావులు పక్కన పెట్టండి, కనీసం వారి ఆరోగ్యం ఇంకా క్షీణించి ఉండదా…
అరాచకo, మతత్వo ఎంత దూరం అయినా వెళతాయి. తన మన అన్న బేధం ఉండదు. పెరట్లో తిరుగుతున్న నాగు పక్కింటి వాళ్ళనే కాటు వేస్తుంది ఆన్న గ్యారంటీ ఉండదు…మీ వరకు విషాలు చిమ్మే బుల్డోజర్లు చేరక ముందే కళ్ళు తెరవండి, అన్యాయపు గట్టు వైపు నిలబడ్డo మానండి…
భారత దేశంలో కని విననటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి….బీజేపీ RSS దూకుడు పెంచాయి…ఇంకో ఆరు నెలలు కష్టా కాలమే. కర్ణాటక ఫలితాలను చూసి బీజేపీ, rss వర్గాల్లో భయం పుట్టుకుoది…అందుకే ప్రధాన ఎన్నికల అధికారి ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం ఉండకూడదు అని బిల్ పెట్టారు…అన్నీ అప్రజాస్వామిక చర్యలే…అంతా మోసం…నటన…ఇంకా ఇతనికి వంతు పాడుతున్న వారిని చూస్తే జాలి కలుగుతోంది…. మానవత్వo వైపు నిలబడ్డ ప్రతి హిందూ సోదరుడు గొప్ప మనస్సు కలవాడు…రెండు దారులు ఉన్నా సెక్యులర్ మార్గాన్ని ఎంచుకొని ఫాసిస్టు వర్గాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారందరికీ నా విప్లవాభి వందనాలు…
BJP మారణ హోమ కిరాతక రాజకీయాలు అధిక వర్గాలకు నచ్చట్లేదు…2024 ఎలక్షన్స్ ఫలితాలు బీజేపీ కు వ్యతిరేకంగా ఉండబోతున్నాయి….మణిపూర్ సోదరి ఘటన చాలా మంది మనసున్న మనుషుల హృదయాలను గాయపరిచింది….. ఖచ్చితంగా ఇది నిర్ణయత్మాకo కాబోతోంది…
ప్రతి రోజూ ఏదో ఒక ఘటన దేశoలో, మనస్సు కల్లోల పరిచే మానవ అరాచకాలే…ముస్లిం అబ్బాయి అన్న కారణoగా అతడిని మిగితా పిల్లలతో కొట్టించడం…మిగితా పిల్లలు పోటీ పడి కొట్టడం …..ఆ వీడియో లో నిస్సహాయుడై న ఆ అబ్బాయిని చూస్తూ ఉంటే… కళ్ళలో నుంచి నీళ్లు జల జల కారాయి…మనస్సు అంతా వికలం అయ్యింది…స్కూల్ యూనిఫాం లో ఆ బాబు ఏడుస్తూ ఉన్న రూపమే…మా బాబుకు సరిగ్గా అలాంటి వయస్సే… banglore లో ఉన్నా…వాడు స్కూల్ నుంచి వచ్చాకా..ఒక గంట మాట్లాడా ఫోన్లో…మాట్లాడుతూ ఉంటే గొంతు బొంగరు పోతోంది…నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వాళ్ళ అమ్మకు ఇచ్చేశాడు… పసిగట్టేస్తాడు నా గొంతు మార్పు ఒక్క సెకండ్కే..కన్నా బాగా చదువుకోవాలి..ఇలాంటి వారికి అందనంత ఎత్తుకు ఎదుగాలి…మీ నాన్న చేసిన తప్పు చేయకుండా…నీకు నచ్చిన దేశoలో స్థిర పడాలి…మా ఆవిడకు చెప్పా పిల్లల కంట బడకూడదు ఆ వీడియో అని….
ఎక్కడిది ద్వేషం…ఎందుకింత కోపం…ఒక ఉపాధ్యాయు రాలు అలా ప్రవర్తిస్తుoదా…వీడియోలకు అందని దారుణాలు ఎన్ని…మనము ఒకటి చూస్తున్నాము అంటే, వంద కు పైగా జరిగాయి అని అర్థం …..ఈ ఉపాధ్యాయురాలిని సమర్థించే నీచులు కూడా ఉన్నారు…
ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా బీజేపీ, rss దళితుల పై, మైనారిటీల పై తమ కిరాతక సంతతిని అడ్డూ అదుపూ లేకుండా వేటాడండి అని వదిలేశారు…ఇంత పెద్ద దేశంలో ఇవన్నీ మామూలే అనే సంత ఒకటి ఉంది…. ఏదీ మరి అగ్రవర్ణాల పై నిమ్న వర్గాలు ఇలాంటి దౌర్జన్యాలు చేయడం లేదే…ఇవి మామూలు కాలేదే…
హర్యాణా లో మొత్తం అధికారిక లెక్కల ప్రకారం పన్నెండు వందల ఇళ్లు కూల గొట్టారు…..ముస్లిం లటివి…ఇక వ్యాపార స్థలాలు కొల్లలు…ఎంత మందికి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చి ఉంటాయి కదా…నిలువ నీడ లేకుండా చేయడం ఎక్కడి న్యాయం…
ఆనందంగా ఉంటా…..ఈ రోజు మంచి హోటల్ కు వెళ్లి భోజనం చెయ్యాలి అనుకుంటా…ఇలాంటి సంఘటన కళ్ళ బడుతుంది…అంతే ఆకలి ఆవిరి అయిపోతుంది…నాలుగు పూటల వరకు ముద్ద గొంతు దిగదు….
కళ్ళబడితే వాటి గురించి రాయాలి అనిపిస్తుంది….ఒక్కో అక్షరం రాస్తూ ఉంటే చిత్ర వధ అనుభవించడమే…రాయడానికి తక్కువ అంటే మూడు గంటలు పడుతుంది…కొందరు నమ్మక పోవచ్చు…నేనే బాధితుడిని అన్నoతగా ..ప్రతి వాక్యంలో లీనమైపోతా… రాశాకా సగం రోజు ఆవే ఆలోచనలు…మానసికంగా క్రుoగి పోతా…మీకు అతి అనిపించవచ్చు ..కానీ ఇదే నా వాస్తవిక పరిస్థితి…నేను ఉన్నది కేవలం FB లోనే…ట్విట్టర్..insta అసలు తెలియదు..న్యూస్ చూడను…పేపర్ చదవడం మానేశా…
పిరికి వాడిలా ఇక్కడి నుంచి పారిపోతే, ఏవీ కళ్ళబడవు…మొత్తం శాంతి…నేను నా కుటుంబం అతివాదుల చేతుల్లో పడే వరకు అన్నా ప్రశాంతంగా జీవిస్తాం…..ప్రతి ఘోరం పై రాయటం ఆగిపోతుంది…
చాలా మందిని unfrnd చేశా…fb వాడు ఇంత పెద్ద సంఖ్యలో unfrnd చేయకూడదు అని నియమంతో అడ్డుకున్నాడు… unfrnd చేసిన వారికి మళ్లీ request పెట్టా…
మైనారిటీల జీవితాలు ఎప్పుడూ మెజారిటీ వారి దయా దాక్షిణ్యాల పైననే ఆధార పడి ఉంటాయి…
మట్టి కొట్టుకు పోయిన పాకిస్తాన్లో కూడా chirstian సోదరుల పై దౌర్జన్యాలు చేస్తున్నారు అక్కడి నీచులు…నా దేశం అలా మట్టికొట్టుకు పోకుండా ఉండాలి అనే నా లాంటి వారి తాపత్రయం, ప్రయత్నం….
