కులమతాలకు ప్రతీక రక్షాబంధన్
సిద్దిపేట బాలసదనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖి సంబరాలు
# సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
సిద్ధిపేట;
కులమతాలకు ప్రతీక రక్షాబంధన్ అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో రాఖీ పండుగ సందర్భంగా బాలసదనంలో విద్యార్థినుల చేత రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ మాట్లాడుతూ అనాధ బాలికలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు చేపట్టడం లేదని అన్నారు. అనాధ బాలబాలికలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను ఇవ్వడంతో పాటు వారి పేరున 10 లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయాలని అన్నారు. దాంతోపాటు వారి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించేలా కార్పొరేట్ పాఠశాల కళాశాలలో చదివించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలే ఇప్పటికి అమలవుతున్నాయని అన్నారు. ఇన్నేళ్లు గడుస్తున్నా వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనాధ బాలబాలికలకు చేయూతనందించేలా పథకాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యడారీ మధు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గయాజుద్దీన్. రషద్ బైరి సాయి. సిద్దిపేట పట్టణ మైనార్టీ అధ్యక్షులు సలీం. ఉపాధ్యక్షులు ఫయాజ్ .నవాజ్ తదితరులు పాల్గొన్నారు
