ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారి నివాసం వద్ద అంబరానంటిన రాఖి పండగ సంబరాలు
రాఖి పౌర్ణమి సందర్బంగా ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని తన నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు సోదరీమణులు భారీ సంఖ్యలో విచ్చేసి ఎమ్మెల్యే గారికి రాఖి కట్టి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సోదరి సోదరీమణులు రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న చెల్లెలి అనుబంధానికి ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ రాఖీ పండుగ, అమ్మ నాన్నల తర్వాత అక్క చెల్లెళ్లకి కష్టసుఖాలలో తోడుగా అండగా నిలిచేది అన్న మాత్రమేనని దానికి ప్రతీకగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు ఒక పెద్దన్నగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల సంరక్షణకు అండగా నిలిచారని, బీడీ కార్మికులకు పెన్షన్ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
