Breaking News ఆధ్యాత్మికం

భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు…

32 Views

భక్త మార్కండేయ శోభాయాత్ర

Warning
Warning
Warning
Warning

Warning.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అర్చకులు ఆనందయ్య శర్మ, ఉమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి ,గౌరీ ,కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను జరిపించారు. మంత్రోత్సవాల నడుమ హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఏఎంసి చైర్ పర్సన్ సబేరా బేగం గౌస్, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు ప్రముఖ వైద్యుడు సత్యనారాయణ స్వామి తాజా మాజీ ఎంపీటీసీ నాగరాణి ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. సాయంత్రం గ్రామ పురవీధుల గుండా స్వామి వారి శోభాయాత్రను కన్నుల పండుగ నిర్వహించారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసయ్య మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పట్టణ అధ్యక్షుడు బాబు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు దేవాంతం ప్రధాన కార్యదర్శి రమేష్ ఉపాధ్యక్షులు దేవదాస్ సుదర్శన్ సంయుక్త కార్యదర్శి అంబదాస్ కోశాధికారి బాలరాజు యూత్ అధ్యక్షుడు భాస్కర్ కార్యదర్శి విష్ణుమూర్తి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సభ్యులు భాస్కర్ శ్రీకాంత్ మనోహర్ రమేష్ అజయ్ రవి భీమేశ్వర్ నందన్ రాజు నాయకులు గౌస్ రామ్ రెడ్డి గిరిధర్ రెడ్డి లింగాగౌడ్ కిషన్ ఎల్లయ్య పరశురాములు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్