*మేము మీకు ఎల్లప్పుడూ రక్ష….మీ భద్రత, ఆనందం, శ్రేయస్సు మా బాధ్యత*
—-తల్లితండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్
పెద్దపల్లి ఆగస్టు 29
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో గోదావరిఖని, బృందావన్ గార్డెన్ లో స్థానిక కళాశాలల విద్యార్థులకు షీటీమ్స్, సైబర్ క్రైమ్, డయల్ 100, ట్రాఫిక్ రూల్స్, ఉమెన్ సేఫ్టీ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంకి పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలన్నారు. విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ లక్ష్యాలు అలవర్చుకొని పట్టుదలతో కష్టపడిపైకి రావాలన్నారు. విద్యార్థులు ఏదైనా ప్రమాద, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేసి పోలీస్ సహాయం పొందాలని సూచించారు. కళాశాలకు వచ్చిపోయే సమయంలో ఆకతాయిలు వేధిస్తే వెంటనే 100కు గానీ, రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ వాట్సాప్ నెంబర్ 63039 23700 నంబర్ కాల్ చేయాలన్నారు. షీ టీమ్ పోలీసులు ప్రజలు, మహిళలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ మహిళలపై అఘాయిత్యాలు జరుగకుండా చూస్తుంటారన్నారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వారితో చాటింగ్ చేయవద్దని, ఇతరులు పెట్టే మెస్సేజ్లకు స్పందించవద్దని సూచించారు. ఆన్లైన్ వేధింపులు, బ్లాక్ మెయిల్ చేయడంవంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి, అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తల్లితండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు ఆన్లైన్ మోసాలు, బ్యాంక్ సేవల మోసాలు, వాట్సాప్, ట్విట్టర్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయట ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు.
అనంతరం బాలికలు డీసీపీ, ఏసీపీ కు, సీఐలకు , ఎస్ఐలకు, పోలీస్ సిబ్బంది కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి తులా శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ప్రసాద్ రావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రహీం పాషా, పెద్దపల్లి షీ టీం ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, గోదావరిఖని వన్ టౌన్ ఎస్సైలు స్వామి, సమ్మయ్య, సుగుణాకర్ శరణ్య, సౌజన్య, పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





