Breaking News

మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ABVP నాయకుల ధర్నా..

152 Views

మేడ్చల్ పట్టణంలోని మంత్రి మంత్రి మల్లా రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ABVP నాయకుల యత్నం..

మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ABVP నాయకుల ధర్నా..

ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…

మేడ్చల్ ఆగస్టు 29- మేడ్చల్

పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని,అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై లిస్టును వెంటనే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, జాయింట్ సెక్రెటరీ శ్రీనాథ్లు అన్నారు.మంగళవారం మేడ్చల్ పట్టణంలోని మంత్రి మల్లారెడ్డి బిఆర్ఎస్ క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ముట్టడించారు,చేతకాని ప్రభుత్వమా గద్దె దిగు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.క్యాంపు కార్యాలయం ముట్టడించి కార్యాలయం గేటు వద్ద విద్యార్థి నాయకులు బయటాయించి ధర్నా చేపట్టారు.దీంతో పోలీసులు ని అదుపులోకి తీసుకునే క్రమంలో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ధర్నా ఆపేయాలని పోలీసులు ఎంత చెప్పినా విద్యార్థి నాయకులు వినకపోవడంతో ఏబీవీపీ విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *