*నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భర్తను హతమార్చిన భార్య.*
నిజామాబాద్:ఆగస్టు 29
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది భర్త పెట్టే బాధలు భరించలేక భార్య తన తల్లిదండ్రులతో కలిసి గొడ్డలితో నరికి దారుణంగా చంపేసింది ఈ ఘటన నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది.
రూరల్ సీఐ వెంకటనారాయణ రూరల్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రశేఖర్ కాలనీకి చెందిన కృష్ణకు అదే కాలనీకి చెందిన గంగతో వివాహం అయ్యింది.
అయితే భర్త కృష్ణ, భార్య గంగతోపాటు అతని అత్తామామలతో తరచూ గొడవ పడేవాడు ఇదే క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కృష్ణ అత్తగారింటికి వెళ్లాడు అక్కడ భార్య తో వాగ్వాదానికి దిగాడు దీంతో విసిగిపోయిన భార్య, ఆమె తండ్రి మురళి తల్లి సత్తమ్మ కలిసి గొడ్డలితో నరికి హత్య చేశారు.
మొదట భర్త కంట్లో కారం చల్లి అనంతరం గంగ తండ్రి మురళి తల్లి సత్తమ్మ గొడ్డలి తీసుకుని కృష్ణ పై దాడి చేసి నరికి వేశారు బయటకు వచ్చిన కృష్ణ అక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ రూరల్ ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
