కరీంనగర్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాబాజ్ ఉల్లా ఖాన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని షాబాజ్ ఉల్లా ఖాన్ కు అందజేశారు.
ఈ సందర్భంగా షాబాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు సోహెల్ కి, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ కు, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సా మొహసిన్ కి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.