బాధితులతో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ .
బాధితులను స్వయానా తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ .
బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన విప్.
గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, అక్కడే చిక్కుకుపోగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహాయక చర్యలను ముమ్మరం చేసి వారిని ఒడ్డుకు చేర్చారూ.
ఒడ్డుకు చేరీన బాధితులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధితులను స్వయానా వారి కారులో ఎక్కించుకొని ఎల్లారెడ్డి పేటలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రివైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వరదల్లో గల్లంతు అయ్యిన నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం కల్పించారు.
నాగయ్య కుటుంబనికి అండగా ఉంటామని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు.





